ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రైట్స్ తీసుకున్న పేరున్న రైటర్

ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రైట్స్ తీసుకున్న పేరున్న రైటర్

Published on Dec 8, 2014 7:26 PM IST

temper_1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ అప్పుడే మొదలైంది. ఈ సినిమా కథ అందించింది ఫేమస్ రైటర్ వక్కంతం వంశీ. వంశీ ఈ సినిమాకి కథని అందించడమే కాకుండా ఈ మూవీ నెల్లూరు రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర టీం గోవా షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఆ తర్వాత ఓ సాంగ్ షూట్ ని కూడా ఫినిష్ చేసుకుంది. దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ కల్లా ఫినిష్ చేయనున్నారు. రిలీజ్ డేట్ కి తక్కువ సమయం ఉండడంతో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్ ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 14న గుంటూరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు