కార్తీ లేటెస్ట్ రిలీజ్ ఖైదీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ మంచి ఫలితమే ఇచ్చింది. కార్తీ కెరీర్ లో 100కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా ఖైదీ రికార్డుల కెక్కింది. విడుదలైన తెలుగు మరియు తమిళ భాషలలో విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా విడుదలైన నెల రోజులకు గాను ఖైదీ మూవీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి రానుంది. నేటి నుండి హాట్ స్టార్ లో ఖైదీ తమిళ మరియు తెలుగు వర్షన్స్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. హాట్ స్టార్ ఖాతా దారులు ఎక్సక్లూసివ్ గా ఖైదీ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఇక ఖైదీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. కేవలం ఒక రాత్రిలో జరిగే క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు. కార్తీ తన తదుపరి చిత్రంగా దొంగ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో తంబీ గా వస్తుండగా జ్యోతిక కీలక పాత్ర చేస్తుంది. జ్యోతిక కార్తీ అక్క పాత్ర చేయడం విశేషం. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.


