‘ఎన్టీఆర్ – ఏఎన్నార్’ ల సోదర భావం చూపిస్తారట !

‘నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ ఎన్టీఆర్ జీవితకథను దర్శకుడు క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ప్రధానపాత్రల గెటప్స్ ని రివీల్ చేస్తూ వస్తోన్న చిత్రబృందం తాజాగా నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన గెటప్ ను కూడా విడుదల చేశారు. సుమంత్ ఏఎన్నార్ గెటప్ లో ఏఎన్నార్ లా బాగానే ఆకట్టుకున్నాడు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ ల బంధాన్ని చూపించనున్నారు. ఎన్టీఆర్ గారి జీవితంలో అక్కినేని నాగేశ్వరరావుగారిది ముఖ్యమైన పాత్ర. ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావుగారితో కలిసి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇద్దరు చివరి దశ వరకు కలిసి ప్రయాణించారు. మంచి చెడ్డలను కలిసి పంచుకున్నారు. ఇద్దరూ సోదర భావంతో చివరవరకు మెలిగారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా వారి అనుబంధాన్ని బాగా చూపిస్తున్నారట.

కాగా నవంబర్ కల్లా టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.