
ప్రస్తుతం తెలుగు హీరోలంతా ‘లుక్’ జపం చేస్తున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవ్వరూ ఊహించనంత స్టైలిష్‌గా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మ్యాజిక్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మాయ చేసే చేసే దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో అలరించనున్నారు. ఈ మధ్యే లండన్‌లో మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం లండన్ వీధుల్లో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్‌ల మధ్యన ఒక పాటను షూట్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఆధ్వర్యంలో ఈ పాట తెరకెక్కుతోంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రాజేంద్రప్రసాద్, జగపతి బాబు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. యూరప్‌లో భారీ ఎత్తున జరిగే ఈ షెడ్యూల్ సెప్టెంబర్ వరకూ కొనసాగనుందని సమాచారం.