అక్కడ సల్మానైతే ఇక్కడ ఎన్టీఆర్…!

Published on May 30, 2019 11:57 am IST

ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రకటన కర్తగా కూడా నాకు తిరుగులేదంటున్నాడు. చాలా కార్పొరేట్ బ్రాండ్స్ కి ఎన్టీఆర్ హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్న ఎన్టీఆర్ కొన్నిరోజుల క్రితమే పార్లే ఆగ్రో కంపెనీ ప్రోడక్ట్ అయిన అప్పీ ఫిజ్ కి సౌత్ ఇండియా ప్రచార కర్తగా ఉండడానికి ఒప్పందం చేసుకున్నారు.

ఈ శీతల పానీయానికి నేషనల్ ప్రచార కర్తగా సల్మాన్ ఖాన్ ఎప్పటి నుండో చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై సౌత్ ఇండియా వరకు అప్పీ ఫిజ్ ప్రకటనలో సల్మాన్ బదులు, ఎన్టీఆర్ కనపడనున్నారు. ఇలా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్,నేషనల్ బ్రాండ్స్ కి ప్రచార కర్తగా చేస్తూ తన స్టామినా ఏమిటో నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరలో నిరవధికంగా జరగనున్న “ఆర్ ఆర్ ఆర్ ” షూటింగ్ లో పాల్గొంటారు.

సంబంధిత సమాచారం :

More