స్టార్ కిడ్స్ లోనే టాప్ ప్లేస్ లో.. ఎన్టీఆర్ ‘భార్గవ్ రామ్’ !

Published on Mar 11, 2020 4:22 pm IST

ఎన్టీఆర్ హోలీ సందర్భంగా దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఆ ఫోటో బాగా వైరల్ అయింది. ఫోటోలో తమ ఇద్దరు కొడుకులతో ఉన్న ఎన్టీఆర్ దంపతులను చూసిన నందమూరి ఫ్యాన్స్.. ఆ ఫోటోను తెగ లైక్స్ అండ్ షేర్లతో హోరెత్తించారు. ముఖ్యంగా చిన్న స్మైల్ తో క్యూట్ లుక్స్ తో ఉన్న ‘భార్గవ్ రామ్’ అందరీ అంటెక్షన్ ను తన వైపుకు తిప్పుకున్నాడు.

పైగా ఇంతవరకూ ఏ స్టార్ హీరో కొడుకు సాధించలేనిది కేవలం ఒక్క ఫోటోతోనే మా ‘భార్గవ్ రామ్’ సాధించాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ ఫోటోకి 84.2k లైక్స్ వచ్చాయి. ఇంకా విస్తృతంగా వస్తూనే ఉన్నాయి. అది కూడా ఒక్క రోజులోనే. టాలీవుడ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాప్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోస్ కి కూడా ఇప్పటివరకూ ఇన్ని లైక్స్ రాలేదు.

అంతెందుకు గతంలో ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఏ ఫోటోకు ఇన్ని లైక్స్ రాలేదు. ఇంత విస్తృతంగా లైక్స్ రావడానికి ముఖ్య కారణం ఫోటోలో ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్న ‘భార్గవ్ రామే’ అని నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు. ఏమైనా ఇంతవరుకూ ఏ స్టార్ హీరో కుమారుడు సాధించలేని క్రేజ్ ను కేవలం ఒక్క స్మైల్ తోనే సాధించి స్టార్ కిడ్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యాడు లిటిల్ టైగర్.

సంబంధిత సమాచారం :

More