ఎన్.టి.ఆర్ కేరాఫ్ 15 ఏళ్ళ సక్సెస్ఫుల్ కెరీర్

ఎన్.టి.ఆర్ కేరాఫ్ 15 ఏళ్ళ సక్సెస్ఫుల్ కెరీర్

Published on Nov 16, 2015 10:17 AM IST

ntr1

నందమూరి ఫ్యామిలీ నుంచి 15 ఏళ్ళ క్రితం ఓ స్టార్ కిడ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసి అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. నేటితో ఎన్.టి.ఆర్ తెలుగు తెరకు పరిచయమై 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్.టి.ఆర్ ఆ తర్వాత వెంట వెంటనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి సినిమాలతో బాక్స్ ఆఫీసు రికార్డ్స్ ని బద్దలు కొట్టి, మాస్ హీరోగా స్టార్డం ని తెచ్చేసుకున్నాడు.

ప్రస్తుతం సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరుగా వెలుగొందుతున్న ఎన్.టి.ఆర్, తన డైలాగ్ డిక్షన్, పెర్ఫార్మన్స్ మరియు డాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అలాగే కెరీర్లో ఇప్పటికే పలు డిఫరెంట్ పాత్రలను కూడా చేసేసాడు. ముఖ్యంగా అదుర్స్ సినిమాలో చేసిన చారి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అమితంగా నవ్విస్తోంది. ఇలా కెరీర్లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఎన్.టి.ఆర్ ఇప్పటి వరకూ 24 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు