ఇది ఎన్టీఆర్ డెడికేషన్ !

ఇది ఎన్టీఆర్ డెడికేషన్ !

Published on Mar 3, 2018 8:51 AM IST

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల ప్రారంభం కానుంది. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ మార్చుకున్నాడు. బాగా బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు.

తాజాగా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. న్యూ లుక్ లో ఎన్టీఆర్ ఫిదా చేస్తున్నాడు. అభిమానులు తమ హిరో లుక్ చూసి సంబరపడిపోతున్నారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో యంగ్ టైగర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ గత నాలుగు సినిమాల నుండి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్స్ లో దర్శనం ఇస్తున్న ఎన్టీఆర్ డెడికేషన్ చూస్తుంటే మెచ్చుకోక తప్పదు.

తాజా వార్తలు