వి ఆర్ వెయిటింగ్… అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

వి ఆర్ వెయిటింగ్… అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Published on Jan 8, 2020 8:29 AM IST

ntr

నందమూరి అభిమానులకు నేడు పండుగ రోజు అని చెప్పాలి. నేడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం ఏడు గంటల నుండి జరగనున్న ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఎన్టీఆర్ అభిమానులలో ఆనందం పెల్లుబికింది. వారు వేదికపై ఎన్టీఆర్ ని చూడాలని..ఆయన చెప్పే స్పీచ్ వినాలని తహతహలాడిపోతున్నారు. ఎన్టీఆర్ నుండి గత ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీ గా గడపడం వలన ఎటువంటి పబ్లిక్ మరియు ప్రైవేట్ కార్యక్రమాలలో ఆయన కనిపించడం లేదు. దీనితో ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ నేడు ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ నందు ఆయన సందడి చేయనున్నారు. గత ఏడాది అరవింద సమేత వీరరాఘవ చిత్ర విజయోత్సవ వేడుకలలో బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలిసి పాల్గొన్నారు. ఇక దర్శకుడు సతీష్ వేగేశ్న ఎంత మంచివాడవురా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి 15న ఈ చిత్రం విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు