
ప్రస్తుతం తెలుగు హీరోలంతా లుక్ జపం చేస్తోన్న నేపథ్యంలో అభిమానులంతా తమ హీరోలను సరికొత్తగా చూసే అవకాశం దక్కుతోంది. ఎన్టీఆర్ అభిమానులను సైతం ఈ లుక్ ట్రెండ్‌లో తమ హీరోను సరికొత్తగా చూస్తూ సంబరాల్లో మునిగిపోయారు. టెంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ విభిన్న కథాంశాల దర్శకుడు సుకుమార్‌తో జతకట్టిన విషయం తెలిసిందే! స్టైలిష్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. షూటింగ్ మొదలైన రోజే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ మధ్యే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మరో లుక్ అభిమానులకు సంబరాలనే తెచ్చిపెట్టిందని చెప్పాలి. స్టైలిష్ గడ్డం, హెయిర్ కట్‌తో ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా కనిపిస్తోన్న ఎన్టీఆర్ లుక్ ఒక్కమాటలో అదిరిపోయిందనే చెప్పాలి. ఈ లుక్ చూసిన తర్వాత అభిమానులంతా సినిమా కోసం ఇంకా ఆసక్తి పెంచేసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కచ్చితంగా హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ‘టెంపర్’తో ఓ కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచిన ఎన్టీఆర్, ఇప్పుడీ సరికొత్త స్టైలిష్ లుక్‌తో కట్టిపడేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులంతా సుకుమార్-ఎన్టీఆర్ సినిమా ఎప్పుడొస్తుందనే దానిపైనే శ్రద్ధ పెట్టారు. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

