ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆ రోజున ట్రిపుల్ బొనాంజా రెడీ ?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆ రోజున ట్రిపుల్ బొనాంజా రెడీ ?

Published on Apr 17, 2024 3:02 PM IST

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నాయి.

ఇక ఈమూవీని అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. మరోవైపు తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు ఎన్టీఆర్. ఇక వీటి తరువాత ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక మూవీ చేయనున్నారు ఎన్టీఆర్.

అయితే విషయం ఏమిటంటే, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం ఈ మూవీస్ నుండి మూడు అప్ డేట్స్ రిలీజ్ కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఆ రోజున వార్ 2 నుండి ఫస్ట్ లుక్, దేవర మొదటి సింగిల్ అప్ డేట్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించి కూడా ఒక అప్‌డేట్ రానుందట. ఈ విధంగా ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా ఖాయం అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు