అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్టీఆర్ సినిమా !

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్టీఆర్ సినిమా !

Published on Nov 14, 2018 7:40 PM IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఈ షూట్ లో దానవీరశూరకర్ణ చిత్రానికి సంబంధించిన సీన్స్ ను చిత్రబృందం చిత్రీకరిస్తోంది.

కాగా, ఈ రోజు దానవీరశూరకర్ణ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటను దుర్యోధనుడు గెటప్ లో ఉన్న బాలయ్య పై చిత్రీకరించారట. కాగా ఈ పాటలో బాలయ్య సరసన శ్రీయా శరణ్ నటించిన్నట్లు తెలుస్తోంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు