
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టెంపర్’ సినిమా రిలీజ్ కానున్న వారం రానే వచ్చేసింది. మరో 4 రోజుల్లో అనగా ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా నిన్న మధ్యాహ్నం నుండి కంటిన్యూగా రాత్రి 12: 45 నిమిషాల వరకూ డబ్బింగ్ చెప్పి సెకండాఫ్ కి డబ్బింగ్ ఫినిష్ చేసారు. దాంతో ఎన్.టి.ఆర్ తన పార్ట్ కి సంబందించిన మొత్తం డబ్బింగ్ ని ఫినిష్ చేసారు.
ఎన్.టి.ఆర్ డబ్బింగ్ ఫినిష్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ టీం సెన్సార్ కి పంపవలసిన ఫస్ట్ కాపీని సిద్దం చేసే పనిలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. సెన్సార్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుందా అని ఈ చిత్ర టీం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి సారి ఎన్.టి.ఆర్ పూర్తి స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అందాలా భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తే మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

