ఎన్టీఆర్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్

ఎన్టీఆర్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్

Published on Sep 15, 2015 4:41 PM IST

ntr-new-still
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ అంటే డీటైలింగ్‌కు, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కు పెట్టింది పేరు. ఇక మాస్‌, యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్‌తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే దానిపై ఏ స్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌లో ఎన్టీఆర్ గెటప్‌కు అంతా ఫిదా అయిపోగా, తాజాగా అభిమానులను అలరించేందుకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17న వినాయక చవితి సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం యూరప్‌లో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పట్నుంచే ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తూ ఉండడం విశేషంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 17న విడుదల కానున్న ఫస్ట్‌లుక్‌తోనే సినిమా టైటిల్‌ను కూడా విడుదల చేయనున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు