లేటెస్ట్ : తారక్, హృతిక్ ల “వార్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్డ్.!

లేటెస్ట్ : తారక్, హృతిక్ ల “వార్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్డ్.!

Published on Nov 29, 2023 12:02 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ అండ్ మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ డ్రామా “వార్ 2” అని చెప్పాలి. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే నెక్స్ట్ లెవెల్ హైప్ స్టార్ట్ కాగా ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ బాలీవుడ్ నుంచి వచ్చేసింది. దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయ్యిపోయింది. ఈ మాసివ్ మల్టీ స్టారర్ చిత్రాన్ని మేకర్స్ 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు 14 గురువారం నాడు సినిమా రిలీజ్ కాబోతుంది అని ఇప్పుడు ఫిక్స్ అయ్యింది. సో ఈ చిత్రం కోసం అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ భారీ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు