
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ‘రభస’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నసమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఈ మూవీలో రెండు రకాల పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను నవ్వించనున్నాడు. అలాగే రభసలో ఎన్.టి.ఆర్ చేసే సందడి కూడా సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. గతంలో ‘బాద్షా’ సినిమాలో కూడా ఎన్.టి.ఆర్ మూడు రకాల పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను బాగా నవ్వించాడు.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్.టి.ఆర్ తో ప్రముఖ నటీనటులు పాల్గొంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్.
బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూలైలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు 20న రిలీజ్ చేసే అవకాశం ఉంది.