ఆ ఇద్దరు డైరెక్టర్స్ కి ఎన్టీఆర్ క్లియర్ ఇండికేషన్స్..!

ఆ ఇద్దరు డైరెక్టర్స్ కి ఎన్టీఆర్ క్లియర్ ఇండికేషన్స్..!

Published on Dec 17, 2019 8:28 AM IST

టాలీవుడ్ లో ఎన్టీఆర్ రాజమౌళిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ హీరో ఎన్టీఆర్ కాగా, రాజమౌళి మొదటి బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రితో అందుకున్నారు. ఇక వీరు చివరిగా 2007లో యమదొంగ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేయడం జరిగింది. దాదాపు 12ఏళ్ల తరువాత వీరు చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఫిక్షన్ తో కూడిన పీరియాడిక్ డ్రామాగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ విషయంలో ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారట.

ప్రస్తుతం తన ధ్యాస మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీపైనే కేంద్రీకరించారట ఎన్టీఆర్. సహజంగా గొప్ప నటుడిగా పేరున్న ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కొరకు మరింత శ్రద్ధతో నటిస్తున్నారట. ఇందు కారణంగా ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్స్ అయిన అట్లీ, కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ వంటి వారు కథలు సిద్ధం చేసి చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా ఆయన సుముఖత చూపించడలం లేదట. కథా చర్చలు, నూతన ప్రాజెక్ట్స్ వంటి విషయాలు వచ్చే ఏడాది జులై తరువాతే అని ఎన్టీఆర్ నిర్ణయమని తెలుస్తుంది. మరి ఆర్ ఆర్ ఆర్ పట్ల ఇంతటి శ్రద్ధ తీసుకుంటున్న ఎన్టీఆర్ నటన కొమరం భీమ్ గా ఏస్థాయిలో ఉంటుందో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు