ఏపీ &తెలంగాణ లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కలక్షన్ల వివరాలు !

Published on Jan 10, 2019 12:25 pm IST

లెజండరీ యాక్టర్ పొలిటీషియన్ నందమూరి తారక రామారావు జీవిత కథ తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రం నుండి మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొంది. దాంతో ఈ చిత్రం మొదటి రోజు యూఎస్ఏ లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.

ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో మొదటి రోజు ఈచిత్రం 7.61కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పండుగ సీజన్ కావడం ఈ చిత్రానికి ప్లస్ కానుంది. అయితే మరో రెండు రోజుల వ్యవధిలో ‘వినయ విధేయ రామ , ఎఫ్ 2’ చిత్రాలు విడుదలకానున్నడంతో ఈ చిత్ర కలెక్షన్ల ఫై వాటి ప్రభావం పడే అవకాశం వుంది.

తెలంగాణ &ఏపీలో మొదటి రోజు ఏరియాల వారిగా కలెక్షన్ల వివరాలు

 

ఏరియా కలక్షన్స్
నైజాం 1.72 కోట్లు
సీడెడ్ 80లక్షలు
నెల్లూరు 52లక్షలు
గుంటూరు 2.04 కోట్లు
కృష్ణా 74,30,211
పశ్చిమ గోదావరి 68లక్షలు
తూర్పు గోదావరి 41,06,116
ఉత్తరాంధ్ర 69,78,554
ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్ 7. 61 కోట్లు

సంబంధిత సమాచారం :

X
More