జనవరిలో సెట్స్‌పైకి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా!

జనవరిలో సెట్స్‌పైకి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా!

Published on Sep 20, 2015 4:34 PM IST

ntr-koratala-siva-mytri-mov
‘శ్రీమంతుడు’.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాక, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖుల దగ్గర్నుంచి ఎన్నో ప్రశంసలను కూడా అందుకొని మహేష్ కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచింది. ఇక మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ, ‘శ్రీమంతుడు’తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయారు. ఇక ఇదే సినిమా ద్వారా తెలుగు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

ఇదిలా ఉంచితే ‘శ్రీమంతుడు’తో క్రేజీగా మారిపోయిన దర్శకుడు కొరటాల శివతోనే తమ రెండో సినిమా కూడా ఉండనుందని మైత్రీ మూవీమేకర్స్ ఇంతకుముందే తెలియజేసిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తన మూడో సినిమాను ప్లాన్ చేశారు. ఎన్టీఆర్-కొరటాల శివ-మైత్రీ మూవీస్ ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందే సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.

ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లండన్ షెడ్యూల్ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇక లండన్ షెడ్యూల్ పూర్తయ్యాక ఎన్టీఆ-కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది. జనవరి నెలలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక మిర్చిలో ‘వీలైతే ప్రేమిద్దాం.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అని, ‘శ్రీమంతుడు’లో ఊరిని దత్తత తీసుకోవడం ఇలా తనదైన మార్క్ కథాంశాలను ఎంపిక చేసుకున్న కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి కాన్సెప్ట్ పట్టుకొస్తారనేది ఆసక్తికర అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు