పరిశ్రమలో మంచి వాక్చాతుర్యం కలిగిన నటులలో ఎన్టీఆర్ ఒకరు. అభిమానులను ఆకట్టుకొనే విధంగా సుధీర్ఘ ప్రసంగాలు చేయడం ఎన్టీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ గత రాత్రి ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఐతే ఎప్పటిలాగే సుదీర్ఘ ప్రసంగం చేస్తారనుకుంటే అనూహ్యంగా ఐదు నిమిషాల లోపే తన ప్రసంగం ముగించారు. దర్శక నిర్మాతలకు బెస్ట్ విశెష్ చెప్పిన ఎన్టీఆర్…తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడాలి అనుకున్న తన కోరిక సతీష్ వేగేశ్న తీర్చారు అన్నారు. అలాగే సంక్రాంతి సినిమాలకు బెస్ట్ విశెష్ చెప్పారు.
చాలా కాలం తరువాత ఎన్టీఆర్ ఓ పబ్లిక్ ఫంక్షన్ లో దర్శనమిచ్చారు. బాగా పెరిగిన జుట్టుతో ఉన్న ఎన్టీఆర్ కొంచెం సన్నబడినట్టు కూడా ఉన్నారు. పాత్ర కోసం ఎన్టీఆర్ అలా సన్నబడ్డారా మరేదైనా కారణం ఉందా తెలియాల్సివుంది. ఇక ఎంత
మంచి వాడవురా మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 15న విడుదల కానుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందించారు.


