ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Feb 12, 2019 5:44 pm IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 22 న విడుదల చేయనున్నారు అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా అతి త్వరలో విడుదలచేయనున్నారు.ఇక ఇటీవల విడుదలైన మొదటి భాగం ఎన్టీఆర్కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరచడంతో ఈ రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా విడుదలచేస్తున్నారు. మరి ఈ మహానాయకుడైన విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :