వారం వెనక్కి వెళ్లిన ‘మహానాయకుడు’ !

Published on Jan 17, 2019 5:22 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కతున్న ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాబట్టుకోలేకపోతుంది. అయితే కథానాయకుడు నిరుత్సాహ పరిచకపోయినా.. పూర్తిగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

కాగా సినిమా మొత్తం స్లో గా సాగడం, ట్రీట్మెంట్ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం వంటి అంశాలూ.. కథానాయకుడు కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపాయి. దాంతో చిత్రబృందం రెండవ పార్ట్ ‘మహానాయకుడు’ ఫై స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ‘మహానాయకుడు’లో లాగ్ లేకుండా.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను ఇంకా యాడ్ చేస్తున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా సమయం సరిపోనందున ‘మహానాయకుడు’ని ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు.

సంబంధిత సమాచారం :

X
More