ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల వాయిదాపడనుందా ?

Published on Jan 13, 2019 11:55 pm IST

నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ రెండు భాగాలుగా విడుదలకానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి భాగం ‘కథానాయకుడు’ ను జనవరి 9న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోతుంది. చిత్రంమరి స్లో గా ఉండడం తో ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపించడంలేదని కంప్లైన్ట్ వుంది. దాంతో చిత్ర యూనిట్ రెండవ భాగం మహానాయకుడు ఫై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఆ కారణం తో ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలకావడం కష్టమేనని తెలుస్తుంది. అయితే ఈ విడుదల తేదీ మార్పు ఫై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.

ఇక కథానాయకుడు చిత్రాన్ని కొని నష్ట పోయిన డిస్ట్రీబ్యూటర్లకే ఈ మహానాయకుడు చిత్రాన్ని ఫ్రీగా అమ్మి జరిగిన నష్టాన్ని నివారించాలని టీం భావిస్తోందట. మొదటిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్నిచూపెట్టగా మహానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More