మహాశివరాత్రి ని టార్గెట్ చేసిన మహానాయకుడు !

Published on Feb 7, 2019 1:10 am IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈనెల 9న ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 28న లేదా మార్చి 1 న విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు పరాజయంతో చెందడంతో ఈ సెకండ్ పార్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రమైన విజయం సాధించి బాలయ్యకు ఊరటనిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :