వికారాబాద్ లో ‘మహానాయకుడు’ !

వికారాబాద్ లో ‘మహానాయకుడు’ !

Published on Feb 3, 2019 2:56 PM IST

ntr mahanayakudu1
‘మహానాయకుడు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ హరికృష్ణతో కలిసి చైతన్య రథం పై చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రం అంతా పర్యటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం చైతన్య యాత్ర తాలూకు సన్నివేశాలను క్రిష్ ప్రస్తుతం వికారాబాద్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సన్నివేశాల్లో బాలయ్యతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొన్నారు.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను మాత్రం పెద్దగా రాబట్టుకోలేపోయింది. మరి సెకెండ్ పార్ట్ అన్న.. భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు