ముహూర్తం రోజున బాలయ్యపై చిత్రీకరించబోయే మొదటి షాట్ అదే !

ముహూర్తం రోజున బాలయ్యపై చిత్రీకరించబోయే మొదటి షాట్ అదే !

Published on Mar 27, 2018 10:00 AM IST

తేజ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్న ‘ఎన్టీఆర్’ సినిమా 29న ప్రారంభంకానుంది. మొదటి సన్నివేశం బాలయ్య పై చిత్రీకరిస్తున్నారు. 1940లో ఎన్టీఆర్ మద్రాసుకు రావడం జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఎన్టీఆర్ అక్కడికి వెళ్లారు. ఆ తరువాత ఉద్యోగరీత్యా కొంతకాలం ఆయన మద్రాసులోనే గడపడం జరిగింది. ఆ నైపథ్యంలోనే బాలయ్యపై మొదటి సన్నివేశాన్ని షూట్ చెయ్యబోతున్నారు.

రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకాబోతున్నారు. విష్ణు ఇందురి, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. ఎన్టీఆర్ జననం నుండి జరిగిన కీలక సంఘటనలు, రాజకీయ ప్రవేశం, సినీరంగ ప్రస్థానం వంటి అంశాలు సినిమాలో ప్రధానంగా చర్చించబోతున్నారు దర్శకుడు తేజ.

తాజా వార్తలు