ధుర్యోధనుడి గెటప్లో అలరిస్తున్న బాలయ్య !

నందమూరి బాలక్రిష్ణ తాజా చిత్రం ‘ఎన్టీఆర్’ కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారి చేతులమీదుగా రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కీరవాణి, ఇతర సినీ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు, భారీగా అభిమానులు హాజరయ్యారు.

వేడుకకు బాలక్రిష్ణ రామారావుగారు ధరించిన, తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని పాత్ర అయిన ధుర్యోధనుడి వేషధారణలో విచ్చేసి అందరినీ అలరించారు. సినిమాలోని మొదటి షాట్ కూడ ఆ పాత్ర మీదే చిత్రీకరించడం జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలక్రిష్ణలు స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రాన్ని సంగీతాన్ని అందించనున్నారు.