బండ్ల గణేష్ నిర్మాణంలో పూరి జగన్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ సినిమా ఒకటి మొదలుకానుందని మనకు తెలిసిన విషయమే. మొదటిసారిగా పూరికాకుండా వేరేవారు ఆయన సినిమాలకు కధను అందిస్తున్నారు. వక్కంతం వంశీ కధ రాస్తుంటే, పూరి డైరెక్ట్ చేస్తాడట
ఈ సినిమా జూన్ 1న లాంచనంగా మొదలుకానుంది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. పూరి జగన్నాధ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా సినిమా వచ్చిన విషయం తెలిసినదే. ఈ కొత్త సినిమా వీరిద్దరికీ హిట్ ని తీసుకురావాలని కోరుకుందాం
