
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ మూవీకి పలు టైటిల్స్ వినిపిస్తున్నాయి. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ టైటిల్ ఫైనలైజ్ కాకపోవడం వలన రిలీజ్ చెయ్యలేదు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘షంషేర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర టీం కూడా దీనిపై కాస్త సముఖత చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే టైటిల్ ని పూరి జగన్నాధ్ ఫైనలైజ్ చేస్తే త్వరలోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ తర్వాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా అన్ని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.