ఎన్.టి.ఆర్ ‘రభస’ ఆడియో రిలీజ్ డేట్

ఎన్.టి.ఆర్ ‘రభస’ ఆడియో రిలీజ్ డేట్

Published on Jul 15, 2014 11:46 AM IST

Rabhasa
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని చివరి పాట షూటింగ్ ఈ రోజు నుంచి స్విట్జర్ ల్యాండ్ లో మొదలు కానుంది. ముందుగా జూలై 3 లేదా 4వ వారంలో ఆడియో రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న ఈ చిత్ర టీం తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ని ఖరారు చేసింది. జూలై 27వ తేదీన ‘రభస’ ఆడియోని శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకులకు కావలసినంత కామెడీ కూడా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు