‘ఆర్ఆర్ఆర్’ బిజినెస్ 500 కోట్లు !

‘ఆర్ఆర్ఆర్’ బిజినెస్ 500 కోట్లు !

Published on Nov 18, 2018 1:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఆ అంచనాల కారణంగానే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కులు అన్ని భాషలు కలుపుకొని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని, అలాగే శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు