తారక్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం.?

Published on Apr 7, 2021 6:06 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సిల్వర్ స్క్రీన్ పై ఎంత స్టార్డం ఉందో తెలిసిందే. అలాగే సిల్వర్ స్క్రీన్ పై తో పాటుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా తనదైన మార్క్ ను తారక్ బిగ్ బాస్ షో తో సెట్ చేశారు. అయితే అది అయ్యి చాలా కాలం అయ్యింది మళ్ళీ జెమినిలో మరో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ముందుకొచ్చారు.

దీనితో మళ్ళీ సాలిడ్ హైప్ నెలకొంది. అయితే అనౌన్సమెంట్ వచ్చింది అంతా బాగానే ఉంది టైం సెట్టయ్యింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మరో టాక్ బయటకి వచ్చింది. ఈ షో అనుకున్న సమయానికి రావడం కొన్ని కారణాల చేత కుదరలేదట. దీనితో ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ షో కాస్తా జూలై కి షిఫ్ట్ అయ్యిందట. దీనితో తారక్ కు కూడా కాస్త అసౌకర్యమే అని చెప్పాలి. మరి ఈ షో జూలై లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :