సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్

సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్

Published on Aug 11, 2015 7:17 PM IST

NTR-rakul-pretty
సినిమా సినిమాలోనూ వైవిధ్యం చూపే సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్న సంగతి సినిమా తెలిసిందే. ఎన్.టి.ఆర్ సినిమా మొదలైన నాటి నుంచి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ సినిమాని చకచకా ఫినిష్ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ సింగ్ లపై వచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ ని షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ లో ఎన్.టి.ఆర్ కొన్ని క్రేజీ స్టెప్స్ తో ఆకట్టుకోనున్నాడని సమాచారం.

ఎన్.టి.ఆర్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో ఓ సరికొత్త లుక్ లో కూడా కనిపించి థ్రిల్ చేయనున్నాడు. ఆ లుక్ కి సంబందించిన స్టిల్స్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అంతే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ సినిమాలోని ఓ స్టిల్ ని రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ చివరి వరకూ ఈ సినిమా షూటింగ్ లండన్ లోనే జరుగుతుంది. ‘నాన్న కోసం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని 90% షూటింగ్ అబ్రాడ్ లోనే జరగనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు