ఎన్టీఆర్ ‘స్టోరీ’ కాదు ‘స్క్రీన్ ప్లే’ మారింది – క్రిష్

ఎన్టీఆర్ ‘స్టోరీ’ కాదు ‘స్క్రీన్ ప్లే’ మారింది – క్రిష్

Published on Jun 6, 2018 8:21 PM IST

మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై బయోపిక్ తెరకెక్కుతుంది. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణే స్వయంగా ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను రాయించుకున్నారు. ఇప్పుడు క్రిష్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఈ చిత్ర కథను మారుస్తున్నారని రూమర్స్ వచ్చాయి.

కానీ కథలో తాను ఎలాంటి మార్పులు చేయలేదన్న క్రిష్.. కథనంలో మాత్రం కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తున్నారు. తనే స్వయంగా ఈ చిత్రకథనాన్ని తన దృష్టికోణంలో రాయాలని నిర్ణయించుకున్నారట. ఎన్టీఆర్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో, ఒక అభిమానిగా తన మనోనేత్రంతో అలా చూస్తూ ఈ చిత్ర కథనాన్ని రాస్తున్నారని సమాచారం.

ఈ నెలాఖరులో తాను చేసిన మార్పులును బాలకృష్ణకు వినిపించి.. ఆయన సరే అంటే జులైలో మొదటి షెడ్యూల్ షూట్ కి వెళ్లనున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని ట్యూన్ లు కూడా వినిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు