
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’ ఫిబ్రవరి 13న విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ దయా పాత్రలో వెండితెరపై తన దండయాత్ర చూపిన తర్వాత ఓ 15 రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత, తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటివారంలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ను ఇప్పటివరకూ చూడని కొత్త అవతారంలో చూపించడానికి సుకుమార్ కృషి చేస్తున్నారు. హీరో క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ప్రీ – ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయని సమాచారం.
డిఫరెంట్ స్టైల్‌లో సాగే రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

