టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ మూవీ ఈ నెల29న విడుదలకు సిద్ధమైంది. అదేంటీ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల వచ్చే ఏడాది కదా అనుకోకండి. విషయం ఏమిటంటే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం యమదొంగ. సోసియో ఫాంటసీ కథతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ దొంగ గా మరియు యంగ్ రావణుడిగా రెండు గెటప్స్ లో అదరగొట్టారు. కాగా ఈమూవీ విడుదలైన దాదాపు 12ఏళ్ల తరువాత తమిళంలో విజేయన్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 29గ విడుదల తేది నిర్ణయించారు.అనగా ఈ శుక్రవారం విజేయన్ తమిళనాట విడుదలకు సిద్ధమైంది.
తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన యమదొంగ మరి తమిళంలో విజేయన్ గా విజయం సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ సినిమాలకు కన్నడలో మంచి మార్కెట్ కలదు.ఐతే తెలుగు
తో పాటు అతిపెద్ద పరిశ్రమగా ఉన్న కోలీవుడ్ లో ఎన్టీఆర్ ఇంత వరకు తన మార్క్ చూపించలేదు. వచ్చే ఏడాది ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల కానుంది.ఈ తరుణంలో ఓ సూపర్ హిట్ మూవీతో ఎన్టీఆర్ ని తమిళులకు పరిచయం చేసే ఆలోచన రాజమౌళికి రావడం వలనే యమదొంగ చిత్రాన్ని తమిళంలో విజేయన్ గా విడుదల చేస్తున్నారని టాక్. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు.


