యుఎస్ లో అదరగొడుతున్న ఎన్.టి.ఆర్ టెంపర్

యుఎస్ లో అదరగొడుతున్న ఎన్.టి.ఆర్ టెంపర్

Published on Feb 15, 2015 6:42 PM IST

ntr-temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘టెంపర్’. ఈ సినిమాకి బెనిఫిట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా చెన్నై మరియు ఓవర్సీస్ లో కూడా ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఓవర్సీస్ లో కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతోంది. మొదటి రెండు రోజులు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.

మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి $500 డాలర్స్ సాధించిన టెంపర్ రెండవ రోజు కూడా అదే మానియాని కంటిన్యూ చేస్తోంది. రిపోర్టెడ్ స్క్రీన్స్ నుంచి మా దగ్గర ఉన్న సమాచారం యుఎస్ బాక్స్ ఆఫీసు విశేషాలను మీకందిస్తున్నాం.

వారం కలెక్షన్స్

గురువారం ప్రీమియర్స్ – $ 257K
శుక్రవారం – $ 230K
శనివారం – $ 203K
మొత్తం – $ 690K

పైన మేము అందించిన కలెక్షన్స్ విశేషాలు రిపోర్టెడ్ స్క్రీన్స్ నుంచి అందినవి మాత్రమే, ఓవరాల్ గా దీనిక్కన్నా ఎక్కువ కలెక్షన్ వచ్చి ఉంటుంది. ఆ వివరాలను మాకు అందగానే మీకు అందిస్తాం. దీని ప్రకారం మరో రెండు రోజుల్లో టెంపర్ సినిమా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు