యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్త అందించాడు. తనకు జరిగిన సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసి, ప్రేమను కురిపించిన అభిమానులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
అలాగే, తనకు మెరుగైన వైద్యం అందించిన కిమ్స్ ఆస్పత్రి వైద్యుల బృందానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
“మీ అందరి మద్దతే నాకు ప్రతిరోజూ కొండంత బలాన్ని ఇస్తుంది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను” అంటూ తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పెడుతున్నారు.
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon!…— Jr NTR (@tarak9999) August 12, 2026
