యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘టెంపర్’. గత శుక్రవారం ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ప్రేక్షకులు టెంపర్ సినిమాని ఆదరిస్తున్న తీరు చూసి ఎన్.టి.ఆర్ థ్రిల్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఎన్.టి.అర్ సినిమాకి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడం మరియు ఎన్.టి.ఆర్ చేసిన పాత్రకి అందరి నుంచి ప్రశంశలు వెల్లువలా రావడం చూసి ఎన్.టి.ఆర్ చాలా హ్యాపీగా ఉన్నాడు.
ఈ రెస్పాన్స్ చూసి థ్రిల్ అయిన ఎన్.టి.ఆర్ అతని టీం కలిసి టెంపర్ సక్సెస్ పార్టీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాతో ఎన్.టి.ఆర్ కి ఓ కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించగా, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.


