కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు

కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ వస్తున్నాడు

Published on Jan 5, 2020 12:04 PM IST

Entha Manchivaadavuraa

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయాలని చాన్నాళ్ల క్రితమే భావించిన నిర్మాతలు పెద్ద సినిమాల పోటీ ఉన్నా వెనక్కి తగ్గకుండా అదే రోజున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే సినిమాను ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేయడం కోసం బలమైన ప్రమషన్లు చేయాలని నిర్ణయించారు.

అందుకే ముందు నుండి ఊహించినట్టు ప్రీరిలీజ్ వేడుకకు కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. తారక్ సైతం వేడుకకు హాజరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. ‘118’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో కూడా సేమ్ రిజల్ట్ రాబట్టుకోవాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు