ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లుడు శీను’.సక్సెస్ఫుల్ టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఈనెల 29న శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతాడని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఈ కార్యక్రమానికి ఎన్.టి.ఆర్ తో పాటు పలువురు స్టార్ హీరోలు మరియు ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సమాచారం. టాలీవుడ్ డ్రీం గర్ల్ సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. బెల్లంకొండ సురేష్ తన కుమారున్ని ఇంట్రడక్షన్ చేస్తున్న సినిమా కావడంతో ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది.
