రేపు జరగబోయే ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్, చరణ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారని ప్రచారం జరిగింది. తాజా సమాచారం మేరకు ఈ వేడుకకు చరణ్ రావట్లేదని ఎన్టీఆర్ మాత్రమే హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. భారీ ఎత్తున జరగబోయే ఈ వేడుకలో మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని మూడు పాటలు ఇదివరకే విడుదలయ్యాయి. మిగిలిన పాటలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడ ఈ వేడుకకు హాజరుకానుండటం విశేషం.


