శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ కోసం ఎన్టీఆర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Mrithyunjay

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ప్రస్తుతం వరసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘విష్ణు విన్యాసం’ నేడే థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఇదిలా ఉండగానే, ఆయన తర్వాతి చిత్రం ‘మృత్యుంజయ్’ కూడా విడుదలకు సిద్ధమైంది. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ మార్చి 6, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘విష్ణు విన్యాసం’ విడుదల కావడంతో, చిత్ర యూనిట్ ఇప్పుడు ‘మృత్యుంజయ్’ ప్రమోషన్లపై దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు ఒక ప్రత్యేక ఆకర్షణ తోడైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, ట్రైలర్ ఏ సమయానికి విడుదలవుతుందనే విషయాన్ని చిత్ర బృందం ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ఈ థ్రిల్లర్ చిత్రంలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైట్‌బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Exit mobile version