
ప్రస్తుతం శబ్దాలయా స్టూడియోస్ లో, ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘టెంపర్’ సినిమాకు బిజీగా డబ్బింగ్ చెప్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆల్రెడీ, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. గత రెండు రోజులుగా ఎన్టీఆర్ నిర్విరామంగా డబ్బింగ్ చెప్తున్నారు. రేపటితో (ఫిబ్రవరి 6, శుక్రవారం ) ఎన్టీఆర్ డబ్బింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. అభిమానులలో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.

