‘అరవింద’ కోసం కాలేజీలో ఎంటర్‌టైన్‌ చేస్తున్న ‘ఎన్టీఆర్’ !

Published on Jul 17, 2018 8:49 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో ముఖ్యమైన కాలేజ్‌ నేపథ్యంలో జరిగే సన్నివేశాలు చిత్రీకరించడానికి చిత్రబృందం నిన్నటినుండి షూట్ మొదలు పెట్టింది. ఎన్టీఆర్, పూజా హెగ్డేల మధ్య వచ్చే ఈ సన్నివేశాలు పూర్తి ఎంటర్టైనింగ్ గా సాగుతాయట.

ఐతే కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ షెడ్యూల్‌ ఆగష్టు 3వ తేదీ వరకు జరగనుంది. ఆ తర్వాత పొల్లాచ్చిలో పాటల చిత్రీకరణ జరుపుతారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

‘అరవింద సమేత’ టీజర్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న, చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకునట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :