విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఎన్.టి.ఆర్

విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఎన్.టి.ఆర్

Published on Mar 19, 2013 8:30 AM IST

Baadshah-(2)
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 5న భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలు ఈ నెలాఖరు కల్లా పూర్తయిపోతాయని అంచనా వేస్తున్నారు. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఓ పాత్రని పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం తీర్చిదిద్దారు.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. థమన్ అందించిన ఈ మూవీ మ్యూజిక్ ఆల్బం కి మార్కెట్లో మంచి స్పందన లబిస్తోంది. కాజల అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు