అక్టోబర్‌లో స్పెయిన్‌కు షిఫ్ట్ కానున్న ‘నాన్నకు ప్రేమతో’!

అక్టోబర్‌లో స్పెయిన్‌కు షిఫ్ట్ కానున్న ‘నాన్నకు ప్రేమతో’!

Published on Sep 19, 2015 9:35 AM IST

nanaki-prematho-1
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ అని అనౌన్స్ అయిన రోజునుంచే సినిమాపై అంతటా మంచి ఆసక్తి కనబడింది. ఇక షూటింగ్ మొదలైన రోజే ఒక సరికొత్త స్టైల్‌లో ఎన్టీఆర్‌ను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా వినాయక చవితికి విడుదలైన పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ లుక్‌, టైటిల్‌కు సోషల్ మీడియాలో బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మొదట్నుంచీ కనిపిస్తూ ఉన్న క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే లండన్‌లో మొదలుపెట్టిన 80 రోజుల భారీ షెడ్యూల్ మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత సినిమా యూనిట్ స్పెయిన్‌లో ఓ 20 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసింది. అక్టోబర్ నెలలో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుందని నిర్మాత తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు