23కల్లా పూర్తి కానున్న ఎన్.టి.ఆర్ ‘రభస’

Rabhasa
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది . ప్రస్తుతం ఈ సినిమాలోని చివరి పాటని ఎన్.టి.ఆర్- సమంతల పై స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ ఈ నెల 20తో ముగుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన టీంతో మిగిలి ఉన్న పాచ్ వర్క్ సీన్స్ ని తీసి 23 కల్లా షూటింగ్ ఫినిష్ చేస్తామని ఈ చిత్ర డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు.

ఎన్.టి.ఆర్ ని న్యూ డైమెన్షన్ లో చూపించనున్న ఈ మోవిఎలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపి తెరకెక్కించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. తమన్ అందించిన ఆడియో ని ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసి సినిమానిఆగష్టు 14న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.

Exit mobile version