
జూ.ఎన్టీఅర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినీమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల అయింది. ఇప్పటికే సోషల్ నెట్వర్క్ లో హాల్ చల్ చేస్తున్న ఈ పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాని ఆగష్టు 14న విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘కందిరీగ’ సినిమాకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినీమని డైరెక్ట్ చేస్తున్నాడు. సమంత, ప్రణీత సుభాష్ లు హీరొయిన్ లుగా నటిస్తున్న ‘రభస’ సినీమని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.
ఈ సినీమాలో ఎన్టీఅర్ పాత్ర చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని, మంచి యాక్షన్ కూడా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. వేసవిలో విడుదల చేయాలనీ ముందు అనుకునప్పటికి, దర్శకుడి ఆరోగ్యం బాగో లేనందున సినీమా షూటింగ్ లో ఆలస్యం జరిగింది.

