‘ఎన్టీఆర్ – ఒలివియా’ రొమాంటిక్ సీన్స్ ‘ఆర్ఆర్ఆర్’లోనే హైలైట్ అట !

‘ఎన్టీఆర్ – ఒలివియా’ రొమాంటిక్ సీన్స్ ‘ఆర్ఆర్ఆర్’లోనే హైలైట్ అట !

Published on Dec 5, 2019 10:46 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ అండ్ ఒలివియా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను ప్రస్తుతం రాజమౌలి షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాలు ఎన్టీఆర్ అండ్ ఒలివియా మధ్య కెమిస్ట్రీని బాగా ఎలివేట్ చేసే సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు